సంవత్సరం : 2010
సాహిత్యం : భాస్కర భట్ల
గానం : గీతా మాధురి
సంగీతం : శేఖర్ చంద్ర
పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు
పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ ఓ ఓ .... నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకీ దాగుడుమూతలు అర్ధమే లేదు
మచ్చేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు ...... || పరవాలేదు ||
ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు రంగు కాస్త తక్కువ ఐనా మరి పర్లేదు
మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని
అందంగా లేను అని నిన్నెవరు చూడరని నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది దాని కన్న గొప్పదే లేదు అందగాళ్ళు నాకెవ్వరూ ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు ...... || పరవాలేదు ||
అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు కోర మీసం లేకున్న గాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నే అడగమని సరదాగా తరిమిందే మది నీపై మనసుపడి
మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి
చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు అందుకే ఇంకెవ్వరూ ఇంత నచ్చలేదు
ఎవ్వరేమన్నా సరే నా చేయి నిన్నింక వదిలేది లేదు ...... || పరవాలేదు ||
For same lyrics in English script: