BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Saturday, August 7, 2010

శుభప్రదం - మౌనమే చెబుతోంది




చిత్రం       : శుభప్రదం
సంవత్సరం : 2010
సాహిత్యం  : అనంత శ్రీరామ్
గానం      : బాలు, ప్రణవి
సంగీతం    : మణిశర్మ 





మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ......
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో - 2
చూపు చెబుతోంది నీ చూపు చెబుతోంది ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో 

మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా ఏ మాట నా మాటున దాగుందో - 2
చూపు చెబుతోందా నా చూపు చెబుతోందా ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో 

అదిగో నీ బిడియం నాకు చెబుతోంది ఏమని ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో
ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది ఏమని ఇంత ఆనందాన్ని పంచగ చేరిందో 
ఇరువురి చెరలో పరువం చెబుతోంది ఒకరినొకరం వద్దనుకోలేనంత ప్రేమ సొంతమయ్యిందని
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో

వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ
పలికే ప్రతి పలుకు బాషకి చెబుతోంది శ్వాసచేప్పే ప్రేమబాషం వినమంటూ
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని
మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో 
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో ....

0 comments: